కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం ఓంకారం ఆలయ పాలక మండలి ఛైర్మన్... పీ. ప్రతాప్‌రెడ్డిని విధుల నుంచి తొలగిస్తూ చేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గత నెల 29న టిక్కెట్ల విషయంలో జరిగిన ఘర్షణలో ఆలయ ఛైర్మన్ పి. ప్రతాపరెడ్డి... అర్చకుడు మృగఫణిశర్మపై దాడి చేశాడు. చెర్నాకోలతో చితకబాదాడు. ఈ ఘటనపై అర్చకుల ఆందోళనతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ క్రమంలో ట్రస్ట్ బోర్డు నుంచి ఛైర్మన్ ప్రతాపరెడ్డిని తొలగిస్తూ దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది.
ఓంకారం క్షేత్రం ఛైర్మన్ తొలగింపు - news updates in omkaram temple
కర్నూలు జిల్లా ఓంకారం ఆలయ అర్చకుడిపై దాడికి పాల్పడిన ఆలయ ఛైర్మన్‌ను విధుల నుంచి తొలగిస్తూ... దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఓంకారం క్షేత్రం ఛైర్మన్ తొలగింపు