కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్నూలులో లాక్డౌన్ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాత.. బయటకు వచ్చిన వారిని అడ్డుకుని ప్రశ్నిస్తున్నారు. సరైన కారణం లేకుండా రోడ్డుపై వస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొందరు వాహనదారులపై కేసులు నమోదు చేశారు. వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చికెన్, మటన్, చేపల అమ్మకాలను నిలిపివేశారు. నిత్యావసరాల దుకాణాల వద్ద వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
కర్నూలులో మాంసాహార దుకాణాలు బంద్
కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మాంసాహార దుకాణాలను అధికారులు మూసివేయించారు. ప్రజలు నిత్యావసరాల దుకాణాల వద్ద వ్యక్తిగత దూరం పాటించాలని కోరారు.
కర్నూలులో మాంసాహార దుకాణాల బంద్