ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నికి ఆహుతైన నాలుగు ఎకరాల అరటి తోట.. ఆదుకోవాలంటున్న అన్నదాత

Fire at Banana Plantation: కర్నూలు జిల్లా డోన్ మండలం గోసానిపల్లిలో నాలుగు ఎకరాల అరటి తోట ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 టన్నుల అరటి కాలి బూడిదైంది.

banana plantation on fire at kurnool
కర్నూలు జిల్లాలో అరటి తోట దగ్ధం

By

Published : Mar 14, 2022, 4:35 AM IST

Updated : Mar 14, 2022, 5:36 AM IST

అగ్నికి ఆహుతైన నాలుగు ఎకరాల అరటి తోట

కర్నూలు జిల్లా డోన్ మండలం గోసానిపల్లిలో నాలుగు ఎకరాల అరటి తోట అగ్నికి ఆహుతైంది. బాలరంగస్వామి అనే రైతు.. ఆరు లక్షలు అప్పు చేసి నాలుగు ఎకరాల్లో అరటి మొక్కలు నాటారు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను సాగుచేశాడు. అయితే కోతకు వచ్చే సమయంలో తోటలో ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించగా.. చుట్టుపక్కల రైతులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు విఫలయత్నం చేశారు.

చివరికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే మంటలు వ్యాపించి దాదాపు 60 టన్నుల అరటి కాలి బూడిదయింది. సుమారు రూ. 12లక్షల విలువైన పంట నష్టపోయామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతు బాలరంగస్వామి వేడుకుంటున్నారు.

Last Updated : Mar 14, 2022, 5:36 AM IST

ABOUT THE AUTHOR

...view details