AKHANDA MOVIE 100 DAYS FUNCTION: కర్నూలు ఎస్టీ,బీసీ కళాశాల మైదానం జైబాలయ్య నినాదాలతో మార్మోగింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ శతదినోత్సవ కార్యక్రమానికి.. సీమ జిల్లాల నుంచి అభిమానులు పోటెత్తారు. కర్నూలు డిస్ట్రిబ్యూటర్లు హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డిని గజమాలలతో.. సత్కరించారు. అనంతరం థియేటర్ల యజమానులకు జ్ఞాపికలు అందజేశారు.
బోయపాటి, తాను.. కథా బలాన్ని నమ్ముకుని సినిమాలు తీస్తామన్నారు బాలకృష్ణ. అఘోరా పాత్రలో నటించడానికి బాలయ్య చాలా శ్రమించారని.. బోయపాటి గుర్తు చేసుకున్నారు. శ్రీకాంత్, ప్రజ్ఞ్యా జైశ్వాల్, పూర్ణ సహా ఇతర యూనిట్ సభ్యులు..ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. బాలయ్య సినీగీతాలకు.. కళాకారులు చేసిన నృత్యాలు అభిమానులను ఉర్రూతలూగించాయి.