Baireddy comments : రాయలసీమ గురించి చర్చించేందుకు పవన్ కల్యాణ్ రావాలని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాలు విసిరారు. ప్రత్యేక రాష్ట్రం పేరుతో ప్రజలను రెచ్చగొడితే సహించేది లేదని పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బైరెడ్డి స్పందించారు. రాయలసీమ అంటే సినిమాలు తీసినంత తేలిక కాదని గుర్తు చేశారు. ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే తీగల వంతెనకు వ్యతిరేకంగా చేపడుతున్న పోరాటంలో పాల్గొనాలని కోరారు.
అసలు పవన్ కల్యాణ్ ఏమన్నారంటే :రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.