ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఐ, హెడ్​కానిస్టేబుళ్ల బెయిలు రద్దు అప్పీలు.. - అబ్దుల్ సలాం కేసు తాజా వార్తలు

భార్యాపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కేసులో నిందితులకు ఈ నెల 9న బెయిల్ మంజూరైంది. అయితే సీఐ, హెడ్​కానిస్టేబుళ్ల బెయిలు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీలుపై తీర్పు ఈ నెల 16కు వాయిదా పడింది.

bail cancel
bail cancel

By

Published : Nov 13, 2020, 6:31 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో సస్పెన్షన్​కు గురైన సీఐ సోమశేఖర్​రెడ్డి, హెడ్​కానిస్టేబుల్ గంగాధర్​ల బెయిలును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీలుపై తీర్పు ఈ నెల 16కు వాయిదా పడింది. గురువారం జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి మోకా సువర్ణరాజు దీనిపై విచారణ చేపట్టారు. సోమశేఖర్​రెడ్డి తరపున న్యాయవాది జయరామిరెడ్డి కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. మరో వైపు గంగాధర్ తరపున న్యాయవాది లేకపోవడంతో తీర్పును వాయిదా వేశారు. భార్యాపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కేసులో నిందుతులకు ఈ నెల 9న బెయిల్ మంజూరైంది.

ABOUT THE AUTHOR

...view details