కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆదోని పట్టణ శివారులో సంచరించే ఓ మతిస్థిమితం లేని మహిళ పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. శిశివును చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు మత్తు మందు ఇచ్చి గర్భవతిని చేశారని వైద్యులు నిర్ధరించారు. పసికందు సంరక్షణ బాధ్యతను ఆదోని సీడీపీవో కి అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కామాంధుల కర్కషత్వానికి అనాథగా మారిన పసికందు - baby
మానవత్వం నానాటికి మంటకలిసిపోతుంది. కామాంధుల కర్కషత్వానికి అభం శుభం తెలియని ఓ పసికందు అనాథగా మారాల్సి వచ్చింది. మతిస్థిమితంలేని మహిళకు మత్తు మందు ఇచ్చి గర్భవతిని చేయటంతో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ హృదయవిధారక ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
![కామాంధుల కర్కషత్వానికి అనాథగా మారిన పసికందు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3916487-291-3916487-1563808193147.jpg)
అనాథగా మారిన పసికందు