ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా మహామ్మారి కట్టడికి... గుర్రంపై స్వారీ

కరోనా నియంత్రణకు పోలీసులు నిరంతరంగా శ్రమిస్తున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కోవిధంగా కరోనా కట్టడి చేసేలా అవగాహనను పెంపొందిస్తున్నారు. ప్రజలకు సులువుగా అర్థమయ్యే రీతిలో పోలీసులు వివిధ పద్ధతులు పాటిస్తున్నారు. అలాగే.. ఓ పోలీసు కరోనా వైరస్ చిత్రాలు గల గుర్రం మీద ఎక్కి అవగాహన కల్పించారు. గుర్రం వేగంలాగా కరోనా వ్యాప్తి చెందుతుందని... ఆ వేగాన్ని ఆపేందుకే అందరూ లాక్​డౌన్​ పాటించాలని కోరారు.

Awareness program on corona with horse by police at karnool
గుర్రంపై ఎస్సై మారుతి శంకర్

By

Published : Mar 30, 2020, 7:14 PM IST

ప్యాపిలిలో గుర్రంతో కరోనాపై అవగాహన కార్యక్రమం

కరోనా ఆంక్షల కారణంగా.. లాక్​డౌన్ అమలులో​ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు వివిధ పద్ధతుల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి పట్టణంలో ఓ పోలీసు.. వినూత్నంగా అవగాహన కల్పించారు. కరోనా వైరస్ చిత్రాలున్న గుర్రంపై ఎస్సై మారుతి శంకర్ కూర్చొని... ప్రజలకు వైరస్ వ్యాప్తిని వివరించారు. కరోనా.. గుర్రం స్వారీ కంటే వేగవంతమైనదని.. ఆ వేగాన్ని అదుపు చేయడానికి లాక్​డౌన్​ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అవసరం ఉంటే తప్ప ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావద్దని కోరారు. చౌక దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని చెప్పారు. ఈ విషయాలన్నీ.. గుర్రంపై తిరుగుతూ పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details