కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ... పలు జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు ప్రజలకు సూచించారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో జోకర్ వేషధారణలో.. కరోనాపై ప్లకార్డులతో ప్రచారం చేశారు. గంట గంటకూ చేతులు కడుక్కుంటూనే ఉండాలని... మాస్కులను ధరించాలని ప్రచారం చేశారు.
ఇంట్లో ఉంటే జీవితం.. బయట ఉంటే మరణం - కర్నూలులో కరోనా
కరోనా నియంత్రణలో పోలీసుల సేవలు అభినందనీయం. నిత్యం అందుబాటులో ఉంటూనే ప్రజలకు వైరస్ ప్రభావంపై అవగాహన పెంచుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ట్రాఫిక్ పోలీసులూ.. మరింత వినూత్నంగా ప్రచారం చేసి ప్రశంసలు అందుకున్నారు.
జోకర్ వేషధారణ ద్వారా కరోనాపై అవగాహన