25 ఏళ్లుగా పార్టీకోసం పనిచేశా - allagadda
నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఏదో ఒకస్థానం తనకు కేటాయించాలని తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి కోరారు. తన సేవల్ని పార్టీనే గుర్తించాలని కోరారు.
ఏవీ సుబ్బారెడ్డి
కర్నూలు జిల్లాలోని నంద్యాల,ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఏదో ఒకటితనకు కేటాయించాలని తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి కోరారు. గతంలో భూమా నాగిరెడ్డి కోసం టికెట్ త్యాగం చేశానని చెప్పారు. 25 ఏళ్లుగాపార్టీ కోసం పనిచేశాననిగుర్తుచేశారు. ప్రస్తుత నందాల్య ఎమ్మెల్యేభూమా బ్రహ్మానందరెడ్డి రెండున్నరేళ్ల నుంచే పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.