ఆటో బోల్తా పడి ఇద్దరు యువకులకు గాయాలు - kurnool madikera latest accudent
కర్నూలు జిల్లా మద్దికెర వద్ద ప్రమాదం జరిగింది. స్థానిక పెట్రోలు బంక్ వద్ద ఆటో బోల్తా పడి ఇద్దరు యువకులు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే పత్తికొండ మండలంలో ఆటో బోల్తా కారణంగా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వరుస ప్రమాదాలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లా మద్దికెరలో ఆటో బోల్తా... యువకులకు గాయాలు
.
Last Updated : Jan 5, 2020, 3:30 PM IST