Auto driver honesty: కర్నూలు జిల్లా ఆదోనిలో 25 తులాల బంగారం తిరిగిచ్చి.. ఓ ఆటోడ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. ఆటోలో మరిచిపోయిన ప్రయాణీకురాలి బ్యాగ్ ను పోలీసులకు అప్పగించారు. పట్టణానికి చెందిన శైలజ అనే మహిళ.. ఖాజా మొద్దీన్ ఆటోలో ఎక్కింది. తన వెంట తెచ్చుకున్న బ్యాగులని ఆటోలో మర్చిపోయి బస్టాండ్ కు వెళ్లింది.
బ్యాగును గమనించిన ఆటో డ్రైవర్.. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అందులో 25 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సంబంధిత మహిళకు సమాచారం అందించి, బ్యాగులను ఆమెకు అందించారు. నిజాయితీతో బ్యాగులను అప్పగించిన ఆటోడ్రైవర్ ఖాజా మొద్దీన్ కు పోలీసులు రివార్డ్ అందించి అభినందించారు.