కర్నూలు జిల్లా జుమ్మలదిన్నె గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనార్థం వెళ్లిన భక్తులు దర్శనం అనంతరం తిరుగు పయనమయ్యారు. కోసిగికి ఆటోలో ఎక్కారు. మార్గమధ్యలో జుమ్మలదిన్నె గ్రామ సమీపంలో ఆటో పంచర్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న పోలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాగరాజు , మూకమ్మ , నరసింహులు , అయ్యమ్మ , చిలకమ్మా , నర్సప్పలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు క్షతగాత్రులను హుటాహుటిన కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికితరలించారు.
accident: ఆటో బోల్తా.. ఏడుగురికి తీవ్రగాాయాలు - junneledimma road accident newws
ఆటో బోల్తా పడిన ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. దేవుడి దర్శనానాకి వెళ్లి.. తిరిగి వస్తుండగా కర్నూలు జిల్లా జుమ్మలదిన్నె సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/28-August-2021/12897375_mm.png