ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Srisailam: శ్రీశైలం జలాశయం రెండు గేట్లు ఎత్తిన అధికారులు - శ్రీశైలం జలాశయం వార్తలు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు రెండు గేట్లను ఎత్తి.. స్పిల్​వే ద్వారా 55,966 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

authorities lifted two gates from srisailam reservoir
శ్రీశైలం జలాశయం రెండు గేట్లు ఎత్తిన అధికారులు

By

Published : Oct 13, 2021, 8:18 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో.. అధికారులు రెండు గేట్లను ఎత్తారు. స్పిల్ వే ద్వారా 55,966 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 1,25,3168 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 884.80 అడుగులు ఉండగా.. 214.36 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేసి అదనంగా 66,304 క్యూసెక్కుల నీరు సాగర్​కు విడుదల చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details