ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యాగంటి ఆలయాన్ని పరిశీలించిన అధికారులు - యాగంటి ఆలయాన్ని పరిశీలించిన అధికారుల వార్తలు

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో అక్రమ బ్లాస్టింగ్‌ల కారణంగా దెబ్బతిన్న యాగంటి బసవయ్య రాతి మండపాన్ని అధికారుల బృందం పరిశీలించారు.

Authorities inspected the Yaganti temple
యాగంటి ఆలయాన్ని పరిశీలించిన అధికారులు

By

Published : Jan 29, 2021, 1:52 PM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో అక్రమ బ్లాస్టింగ్‌ల కారణంగా దెబ్బతిన్న యాగంటి బసవయ్య రాతి మండపాన్ని అధికారుల బృందం పరిశీలించారు. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ సురేష్ కుమార్ రెడ్డి, గనుల శాఖ ఏడీ వేణుగోపాల్, ఈవో ప్రసాద్, పురావస్తు శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఆలయ ఆవరణం కిందకి వాలిపోయిన దూలాన్ని ఇతర పరిసరాలను పరిశీలించారు. అనంతరం అధికారులు మాట్లడుతూ మైనింగ్ వల్ల దూలం కిందకి పడిపోయిందా లేక పురాతన ఆలయం కావడం వల్ల కిందకి జారిపోయిందా పూర్తిగా దర్యాప్తు చేస్తామన్నారు. పురాత ఆలయం కావడం వల్లనే రాతిదూలం కిందికి వాలిపోయిందని అయినా సరే పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

ప్రజా న్యాయంలో రాష్ట్రానికి 12వ స్థానం.. ఇండియా జస్టిస్‌ నివేదిక వెల్లడి

ABOUT THE AUTHOR

...view details