కర్నూలు జిల్లా గోస్పాడులో రెండు వర్గాలకు చెందిన వెంకటేశ్వర్లు, సాల్మన్ అనే వ్యక్తులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో గొడ్డలితో దాడి చేయడంతో సాల్మన్ గాయపడ్డారు. తిరిగి కత్తులతో దాడి చేసుకున్నారు. వీరంతా చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. అక్కడా... పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో వైద్యశాల డ్రస్సింగ్ గదికి ఉన్న అద్దాలు ధ్వంసమయ్యాయి. నేలపై రక్తం మరకలు చిందాయి. ఈ సంఘటనను చూసి ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణ ...ధ్వంసమైన ఆసుపత్రి - రెండు వర్గాల మధ్య ఘర్షణ
రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పం దాడులు చేసుకున్నారు. వీరికి తీవ్ర గాయాలవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఒకరిపైఒకరు దాడిచేసుకోవడంతో వైద్యశాల డ్రస్సింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా గోస్పాడులో చోటుచేసుకుంది.
కర్నూలు లో రెండు వర్గాల మధ్య ఘర్ణణ