నాటు సారా తయారీ కేంద్రాలపై.. కర్నూలు జిల్లా ఎక్సైజ్ పోలీసులు విస్తృత దాడులు చేశారు. ఆళ్లగడ్డ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో.. అహోబిలం అటవీ ప్రాంతంలో భారీగా తయారవుతున్న నాటు సారాను గుర్తించారు. తరలించేందుకు సిద్ధంగా ఉన్న1800 లీటర్ల నాటు సారాను, బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించిన ప్లాస్టిక్ డ్రమ్ములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రుద్రవరం మండలంలోని చిత్రేని పల్లె నుంచి అహోబిలం వెళ్లే అటవీ ప్రాంతంలో జరుగుతున్న సారా వ్యాపారంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాటు సారా, బెల్లం ఊటను అక్కడే ధ్వంసం చేశారు.
1800 లీటర్ల నాటు సారా, బెల్లం ఊట ధ్వంసం - Attacks on Aligarh Excise Officers of Kurnool
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహోబిలం అటవీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. రవాణాకు సిద్ధంగా ఉన్న 1800 లీటర్ల నాటు సారా, బెల్లం ఊటను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎక్సైజ్ అధికారుల దాడులు