పురపాలక అధికారిపై వైకాపా నాయకుడు దాడి చేసిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. టెలికాం నగర్లో పురపాలక స్థలాన్ని ఆక్రమించుకుని కార్ పార్కింగ్ షెడ్ నిర్మిస్తున్నారు. పట్టణంలో కొద్ది రోజులుగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్రమంగా నిర్మిస్తున్న షెడ్ తొలగిస్తుండగా వైకాపా నాయకుడు రామస్వామి తనపై దాడి చేసినట్లు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ నాయక్ ఆరోపించారు.
'ఆక్రమణలు తొలగిస్తే.. దాడి చేస్తారా?' - ఆదోని తాజావార్తలు
వైకాపా నాయకుడు తనపై దాడి చేశాడని కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్లానింగ్ అధికారి ఆరోపించారు. ఆక్రమణకు గురైన పురపాలక స్థలంలోని కట్టడాలను తొలగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధిత అధికారి తెలిపారు.
దాడి జరిగిన ప్రాంతంలో అధికారులు