కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం గంగులపాడులో దారుణం చోటు చేసుకుంది. బంగారు నగల కోసం మహిళపై ఓ యువకుడు గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన హుసేన్ బీ అనే మహిళ ఒంటరిగా పొలంలో పని చేస్తుండగా..అదే గ్రామానికి చెందిన గౌస్ ఫీర్ అనే యువకుడు నగల కోసం గొడ్డలితో దాడి చేశాడు. మహిళ కేకలు వేయటంతో నిందితుడు పారిపోయాడు.. తీవ్ర గాయాలపాలైన హుసేన్ బీను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
గతంలోనూ నిందితుడు ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడని..కేసులు కూడా నమోదైనట్లు స్థానికులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.