కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని పొదుపు సంఘాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవటం గర్వంగా ఉందని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. పాణ్యం పొదుపు గ్రూపు సభ్యులు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వైయస్సార్ ఆసరా పథకం ద్వారా పొదుపు సభ్యులకు అందుతున్న లబ్ధిని వివరించారు. పాణ్యం మండల పొదుపు గ్రూపు సభ్యులకు దాదాపు నాలుగు కోట్ల రూపాయల చెక్కును మొదటి విడతగా అందజేశారు.