పురపాలక ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పర్యటన చేశారు. స్థానిక దానిష్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆదోని పురపాలక ఎన్నికల్లో ఎంఐఎం తొమ్మిది స్థానాలు కైవసం చేసుకోవాలన్నారు. నిన్న బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వని పోలీసులను గుర్తు పెట్టుకుంటానని అసదుద్దీన్ అన్నారు. ఎంఐఎం ఎక్కడ గెలుస్తుందోనని భయపడి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పర్మిషన్ ఇప్పించలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో వైకాపాకు ఎక్కువ సీట్లు గెలిపించుకుంటే.. స్థానిక ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందని ఊహలో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేకు పదవి ఇవ్వడం మంచిది కాదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.
సభకు పర్మిషన్ ఇవ్వని పోలీసులను గుర్తుపెట్టుకుంటా: అసదుద్దీన్
కర్నూలు జిల్లా ఆదోని పురపాలక ఎన్నికల్లో ఎంఐఎం తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంటుందని.. అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎంఐఎం గెలుస్తుందనే భయంతో బహిరంగ సభకు నిన్న పర్మిషన్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.
asaduddin owaisi elections campaign in kurnool district adoni