ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారులు అధ్వానం.. ప్రయాణంలో ఒళ్లు హూనం - ఆదోని రోడ్లపై వార్తలు

ఆ పట్టణానికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. స్థానికులు రాకపోకలు సాగించేందుకు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. రహదారి పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు అనారోగ్యం పాలవుతున్నారు. రహదారులు బాగాలేవని అన్నందుకు ఇటీవల ఎమ్మెల్యే మనుషులు ఆటో డ్రైవర్​పై దాడికి దిగడం చర్చనీయాంశమైంది. ఒళ్లు హూనం చేస్తున్న ఆదోని రహదారులపై ఈటీవీ భారత్ కథనం.

roads in bad condition
రహదారులు అధ్వానం.. ప్రయాణంలో ఒళ్లు హూనం

By

Published : Nov 14, 2020, 2:53 PM IST

కర్నూలు జిల్లాలోని అతి పెద్ద పట్టణాల్లో ఆదోని ఒకటి. రెండో ముంబయిగా పేరుగాంచిన ఈ పట్టణంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పత్తి మార్కెట్, జిన్నింగ్ మిల్లులు, ఇండస్ట్రియల్ ఏరియా, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. నిత్యం ఎంతోమంది రైతులు, వ్యాపారులు, ప్రజలతో కిటకిటలాడుతుంటుంది. బళ్లారి నుంచి హైదరాబాద్​కు, కర్నూలుకు వెళ్లాలంటే ఆదోని మీదగానే వెళ్లాల్సి ఉంటుంది. బైపాస్ లేకపోవటంతో... పట్టణంలో నుంచే భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గత కొన్నేళ్లుగా ఆదోనికి వెళ్లే రహదారులు పూర్తిగా పాడైపోయాయి. గత నెలలో కురిసిన వర్షాలకు మరింత ఘోరంగా మారాయి.

ఆదోని- బళ్లారి రహదారి, ఆదోని- పర్వతంపురం రోడ్డు, పట్టణంలోని శ్రీనివాస భవన్ కూడలి నుంచి గణేష్ సర్కిల్ వరకు, మున్సిపల్ మెయిన్ రోడ్డు నుంచి షరాఫ్ బజార్ వరకు రహదారులు బాగా దెబ్బతిన్నాయి. కంకర తేలిపోయింది. వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు దుమ్ము, ధూళితో తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. భారీ వాహనాలు వేగంగా వెళుతున్నప్పుడు కంకర ఎగిరిపడుతోంది. గోతులు, గతుకుల రోడ్డుతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులు బాగాలేవని మాట్లాడినందుకు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఆటో డ్రైవర్​ను విచక్షణారహితంగా కొట్టడం మరింత ఆందోళన కలిగిస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రహదారులు బాగుచేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details