కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామ ఏఎన్ఎంను ఓ యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడు. తరచూ ఫోన్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వీరారెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
HARRASMENT: ఏఎన్ఎంను వేధిస్తున్న యువకుడి అరెస్ట్ - ap 2021 news
గ్రామంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఏఎన్ఎంను.. ఓ యువకుడు వేధిస్తున్నాడు. తరచూ ఫోన్ చేసి పరుష పదజాలంతో దూషిస్తున్నాడు. తట్టుకోలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.
ఏఎన్ఎంను వేధిస్తున్న యువకుడి అరెస్ట్
మండలంలోని మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండాపోయిందని.. పలువురు మహిళలు చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:FIRE ACCIDENT: కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది