మార్చి 10న జరగనున్న కర్నూలు నగరపాలకసంస్థ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ డీకే బాలాజీ తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నగరంలో 52 వార్డుల్లో 380 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 140 సమస్యాత్మక, 130 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. వీటి పరిధిలో 4 లక్షల 50 వేల మంది ఓటర్లు ఉన్నట్లు కమిషనర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు.
నగరపాలకసంస్థ ఎన్నికల కోసం చురుగ్గా ఏర్పాట్లు - news updates in kurnool
కర్నూలు నగరపాలకసంస్థ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ డీకే బాలాజీ తెలిపారు. నగరంలో 380 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న ఆయన... వీటి పరిధిలో 4 లక్షల 50 వేల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.
నగరపాలకసంస్థ ఎన్నికల కోసం చురుగ్గా ఏర్పాట్లు