మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఓ ఆర్మీ ఉద్యోగి స్పెషల్ ఎన్పోర్స్మెంట్ బ్యూరో అధికారులకు చిక్కాడు. అతని దగ్గర నుంచి లక్ష రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా పాన్యం సమీపాన జాతీయ రహదారి పై కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆర్మీ ఉద్యోగిని అధికారులు గుర్తించారు. ఇండో టిబెట్ బోర్డర్ సెక్యూరిటీ ఏపీ బ్రాంచ్ చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న మధుసూధన్‌రెడ్డి, అతని బంధువు రాజశేఖర్‌లు తెలంగాణ నుంచి లక్ష రూపాయల విలువైన మద్యాన్ని అక్రమంగా తీసుకెళ్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ. జయరాం నాయుడు తెలిపారు.
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఆర్మీ ఉద్యోగి - కర్నూులు జిల్లాలో మద్యం అక్రమ రవాణా వార్తలు
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆర్మీ ఉద్యోగిని స్పెషల్ ఎన్పోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ మధుసూధన్ రెడ్డి ఇండో టిబెట్ బోర్డర్ సెక్యూరిటీ ఏపీ బ్రాంచ్ చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నాడు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు.
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఆర్మీ ఉద్యోగి
TAGGED:
Army employee smuggling