Argument between a yongman and Traffic police: ఈ-చలానా వసూలు చేస్తున్న పోలీసు సిబ్బందికి.. కర్నూలు నగరానికి చెందిన యువకుడికి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. కర్నూలు నగరంలోని బిర్లా గేటు వద్ద పోలీసులు ఈ చలానా వసూలు చేస్తున్న క్రమంలో.. నగరానికి చెందిన పరమేష్ ద్విచక్ర వాహనాన్ని ఆపి జరిమానాలను తనిఖీ చేశారు. 1500 రూపాయలు జరిమానా ఉన్నట్టు పోలీసులు గుర్తించి.. డబ్బులు కట్టమన్నారు. జరిమానాల విధింపుపై పోలీసులు, యువకునికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అసభ్య పదజాలంతో దూషించారని పరమేష్ తెలుపగా.. యువకుడే పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులు చెబుతున్నారు. ఈ గొడవ సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. 1500 రూపాయలు ఒకేసారి చలానా ఎలా వేస్తారని యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
జరిమానా విధించారని.. పోలీసులతో యువకుడు వాగ్వాదం - ఏపీ ప్రధాన వార్తలు
Argument between a yongman and Traffic Police: ఈ-చలానాలు వసూలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులతో ఓ వాహనదారుడు వాగ్వాదానికి దిగాడు. కర్నూలులో ఈ చలానాలు వసూలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఓ వాహనాన్ని ఆపి పెండింగ్ ఉన్న చలానా కట్టాలని కోరారు. దీంతో యువకుడు రెచ్చిపోయి ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఘటన కర్నూలులో జరిగింది.
![జరిమానా విధించారని.. పోలీసులతో యువకుడు వాగ్వాదం argument between a yong man and traffic police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17192947-213-17192947-1670927266345.jpg)
పోలీసులతో వాగ్వాదానికి దిగిన యువకుడు
జరిమానా విధించడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన యువకుడు