ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండల్లో వనాలు పెంచాలని లక్ష్యంలో విత్తన బంతుల తయారీ: ఏపీడీ - ఏపీడీ తనిఖీలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని బనవాసి ఫారంలో విత్తన బంతులు తయారీని ఏపీడీ బాలకృష్ణ రెడ్డి తనిఖీ చేశారు. కొండల్లో వనాలు పెంచాలని లక్ష్యంతో వివిధ నర్సరీల్లో విత్తన బంతులు తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

 inspects production of seed balls at Banavasi Farm
విత్తన బంతులు తయారీ నర్సిరీలో ఏపీడీ తనిఖీ

By

Published : May 24, 2021, 10:57 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి ఫారంలో విత్తన బంతులు తయారీని ఏపీడీ బాలకృష్ణ రెడ్డి తనిఖీ చేశారు. జిల్లాలో పది లక్షల విత్తన బంతులు ఉపాధి హామీ పథకం కింద తయారు చేస్తున్నట్లు బాలకృష్ణ రెడ్డి తెలిపారు. బనవాసి ఫారం, ఆలూరు, కాల్వబుగ్గ, ప్యాపిలి నర్సరీల్లో విత్తన బంతులు తయారు చేస్తున్నట్లు వివరించారు.

కొండల్లో వనాలు పెంచాలని ప్రభుత్వ ఉద్దేశించిందని.. వర్షా కాలంలో గుర్తించిన కొండల్లో విత్తన బంతులు నాటడం, వెదజల్లనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రథమంగా బనవాసి ఫారం నర్సరీలో విత్తన బంతులు తయారీ మొదలుపెట్టినట్లు చెప్పారు.

ఇదీచదవండి..ఆనందయ్య ఔషధంపై ఐదారు రోజుల్లో తుది నివేదిక: ఆయుష్ కమిషనర్

ABOUT THE AUTHOR

...view details