ఏపీ ఈపీడీసీఎల్లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఇంజనీర్లను టీఎస్ఎన్పీడీసీఎల్కు బదీలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో నిరసన కార్యక్రమం చేపట్టారు. 69 మందిని బదిలీ చేయడంపై ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజులు నిరసన తెలియజేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ భవనం ముందు భోజన విరామ సమయంలో బదిలీలకు వ్యతిరేకంగా నిరసన చేస్తామన్నారు. బదిలీల విషయం ఎన్ని సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
బదిలీలపై ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆందోళన - AP SEB Engineers association protest latest news
సీనియర్ ఇంజనీర్లను బదిలీ చేయడంపై ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాలుగు రోజుల పాటు భోజన విరామ సమయంలో బదిలీలకు వ్యతిరేకంగా నిరసన తెలపనున్నట్లు వారు తెలియజేశారు.
![బదిలీలపై ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆందోళన AP SEB Engineers Association](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8038719-296-8038719-1594829360712.jpg)
బదిలీలపై ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆందోళన