ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థులు ప్రచారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గ్రామాల్లో తెదేపాలోక్సభ నియోజకవర్గఅభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీవెళ్లి ఓట్లు కోరారు. కరువు సమస్య పరిష్కారానికిజిల్లాలోఎనిమిది వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంపై జగన్,కేసీఆర్, భాజపాకుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రితో జగన్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణలో డబ్బుతో గెలుపొందారన్నారు. అదే విధంగా జగన్‌కూ డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు. తెదేపాఐదేళ్ల పాలనలో అభివృద్ధి ధ్యేయంగా పని చేశామన్నారు.
ఇవి చదవండి