అధైర్యం వద్దు.. మరింత ఉత్సాహంగా పనిచేద్దాం! - ఎన్టీఆర్ జయంతి
సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఎవరూ డీలా పడొద్దని కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ తెదేపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. ఆ పార్టీ నేతలు గౌరు చరిత, గౌరు వెంకట్ రెడ్డి.
gouru
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరులో.. తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి వేడకలకు హాజరయ్యారు.. ఆ పార్టీ నేతలు గౌరు చరిత, గౌరు వెంకట్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో కార్యకర్తలు డీలా పడవద్దని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పార్టీ బలోపేతానికి అంతా కలిసి పని చేయాలన్నారు.