ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో ప్రధాన పార్టీల ప్రచారాల హోరు - tdp_ycp_election_campaign

నామినేషన్ల క్రతువు ముగియడంతో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఇంటింటికీ తిరుగుతూ తమ పార్టీని గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి

By

Published : Mar 26, 2019, 2:03 PM IST

ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి

దూసుకుపోతున్న తెలుగు తమ్ముళ్లు

కర్నూలు జిల్లాలో తెదేపా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొడుమూరులో వ్యాపారస్థుల వద్దకు వెళ్లి తమను గెలిపించాలంటూ అభ్యర్థి రామాంజనేయులు ప్రచారం నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి భరత్ ఇంటింటికీ తిరుగుతూ సైకిల్​కు ఓటెయ్యాలని కోరారు. పాణ్యం అభ్యర్థి గౌరు చరితా రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఆదోనిలో మీనాక్షినాయుడు తరపున ఆయన బావమరిది రంగస్వామి ఓట్లు అభ్యర్థించారు.

వేగం పుంజుకున్న ఫ్యాను ప్రచారం

వైకాపా సైతం ప్రచారంలోవేగం పెంచింది. నందికొట్కూర్ అభ్యర్థి ఆర్థర్ ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఆదోని అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి కుమార్తె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి.

'పోలీసులకు వారంలో ఒకరోజు సెలవు

ABOUT THE AUTHOR

...view details