రెండో రోజు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదుట సెక్యూరీటీ గార్డ్స్ ధర్నా
బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కర్నూలు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్స్ రెండోరోజు ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేశారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని.. కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలని వారు ఆసుపత్రి అధికారులను డిమాండు చేశారు.