ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుదిశ్వాస విడిచిన నంద్యాల ఎంపీ

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. ఏప్రిల్​ 30న బంజారాహిల్స్​లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు మే 2న నిర్వహించనున్న కుటుంబసభ్యులు తెలిపారు

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

By

Published : Apr 30, 2019, 10:45 PM IST

Updated : May 1, 2019, 9:03 AM IST

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి (69)... హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. కిడ్నీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఎస్పీవై రెడ్డిని చికిత్స నిమిత్తం అస్పత్రిలో చేర్పించగా... గత రాత్రి మృతిచెందారు.

ఎస్పీవై రెడ్డి ప్రస్థానం...
1950 జూన్‌ 4న కడప జిల్లా అంకాలమ్మగూడూరులో ఎస్పీవై రెడ్డి జన్మించారు. వరంగల్‌ నిట్‌ (ఆర్​ఈసీ) నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. నంది గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ స్థాపించారు. 1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ రంగంలోకి దిగారు.

రాజకీయ ప్రస్థానం...
తొలుత భాజపా నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఎస్పీవై రెడ్డి... భాజపా తరఫున 1991లో నంద్యాల లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. 1999లో స్వతంత్ర అభ్యర్థిగా నంద్యాల, గిద్దలూరు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేసిన ఎస్పీవై రెడ్డి... నంద్యాలలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2000 సంవత్సరంలో కాంగ్రెస్‌ తరఫున పురపాలక ఛైర్మన్‌ అభ్యర్థిగా రికార్డు మెజార్టీ సాధించారు. 2004, 2009లో నంద్యాల నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎస్పీవై రెడ్డి విజయం సాధించారు. 2014లో వైకాపా తరఫున ఎంపీగా గెలిచారు. 2004, 2009, 2014లో నంద్యాల ఎంపీగా సేవలందించిన ఎస్పీవై రెడ్డి... తాజాగా జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

గురువారం అంత్యక్రియలు...
హైదరాబాద్ నుంచి ఎస్పీవై రెడ్డి భౌతికకాయాన్ని నంద్యాలకు తరలించారు. నంద్యాలలో ఎస్పీవై రెడ్డి భౌతికకాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత
Last Updated : May 1, 2019, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details