కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో పేకాట శిబిరం దాడి ఘటనపై దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు పది రోజులు వాయిదా వేసింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు పిటిషనర్ తరపు న్యాయవాది గడువు కోరడంతో ధర్మాననం అంగీకరించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
గుమ్మనూరు పేకాట శిబిరం కేసు విచారణ పది రోజులు వాయిదా - గుమ్మనూరు పేకాట శిబిరం దాడి కేసు అప్డేట్
కర్నూలు జిల్లా గుమ్మనూరు పేకాట శిబిరం తనిఖీలో పోలీసులపై దాడి ఘటనపై నమోదైన కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో రావాలని విచారణను పది రోజులు వాయిదా వేసింది. కేసు దర్యాప్తు నిష్పాక్షపాతంగా జరగడంలేదని న్యాయవాది బి.పురుషోత్తమరెడ్డి కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తుపై ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయకుండా కోర్టులో వ్యాజ్యం ఎలా వేస్తారని ప్రశ్నించింది.
పేకాట శిబిరాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లిన అధికారులపై దాడికి పాల్పడిన ఘటనపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని కోరుతూ న్యాయవాది బి.పురుషోత్తమరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదన్నారు. తాజాగా ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం...సరైన దర్యాప్తు జరపాలని కోరుతూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయకుండా నేరుగా హైకోర్టులో వ్యాజ్యం ఎలా వేస్తారని ప్రశ్నించింది. మీడియా కథనాల ఆధారంగా పిల్ వేశారా అని ఆరా తీసింది. సరైన ఆధారాలతో కోర్టుకు రావాలని సూచించింది.
ఇదీ చదవండి :'నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 నుంచి 30 వేలు ఇవ్వండి'