ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మైనార్టీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు' - Kurnool district latest news

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై విచారణను సీబీఐకి అప్పగించాలని అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి డిమాండ్ చేసింది. పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవద్దని అన్నారు.

abdul salam family suicide
abdul salam family suicide

By

Published : Dec 4, 2020, 5:22 PM IST

మైనారిటీల పట్ల వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ విమర్శించారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తామని హోంమంత్రి సుచరిత ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అహ్మద్ డిమాండ్ చేశారు. ఘటనలో కేవలం పరిహారం ఇచ్చి.. న్యాయం చేయకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో పేరుకు మాత్రమే మైనార్టీ మంత్రి ఉన్నారని ముస్తాక్ అహ్మద్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details