ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సలాం కేసులో సాక్ష్యాలు తారుమారుకు కుట్ర: నారా లోకేశ్ - muslim family suicide case in andhrapradesh

కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి దోషులను కాపాడే కుట్ర జరుగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని బాధిత కుటుంబ సభ్యులను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు.

nara lokesh
nara lokesh

By

Published : Nov 11, 2020, 3:23 PM IST


వేధింపులకు గురి చేసి సలాం కుటుంబాన్ని మింగేసినా ప్రభుత్వానికి రక్త దాహం తీరలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రాత్రిపూట సలాం కుటుంబసభ్యుల ఇంటికి పోలీసుల్ని పంపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి అఖిల ప్రియ వద్ద సలాం కుటుంబ సభ్యులు వాపోయిన వీడియోను ఆయన ట్విటర్​లో పోస్టు చేశారు.

ఒక మైనార్టీ కుటుంబానికి ఇన్ని వేధింపులా? కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని హింసించడం జగన్ రాక్షస మనస్తత్వానికి పరాకాష్ట. సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి దోషులను కాపాడే కుట్ర జరుగుతోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details