తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబరు 20 తేదీ మధ్యాహ్నం 1.21 నిముషాలకు పుష్కరాలు ప్రారంభం అవుతాయని... డిసెంబరు ఒకటో తేదీ వరకూ నిర్వహించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజా శంకర్ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చారు.
ఈ ఏడాది అక్టోబరు 11వ తేదీన విశాఖలో జరిగిన దైవజ్ఞ సమ్మేళనంలో తుంగభద్రా నదీ పుష్కరాల ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కర్నూలు వెళ్లనున్నారు. పుష్కరాల కార్యక్రమాలకు హాజరై అదే రోజున సాయంత్రం 4 గంటలకు విజయవాడ తిరుగు ప్రయాణమవుతారు.