ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ తెలంగాణ బోర్డర్ : మరోసారి అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు - ఏపీ అంబులెన్సు తాజా వార్తలు

రాష్ట్రానికి చెందిన అంబులెన్సుల మరోసారి తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు టోల్‌ గేట్‌ వద్ద అత్యవసర వైద్య సేవల వాహనాలను నిలిపివేశారు. ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

ఏపీ తెలంగాణ బోర్డర్ : మరోసారి అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు
ఏపీ తెలంగాణ బోర్డర్ : మరోసారి అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు

By

Published : May 14, 2021, 9:16 AM IST

Updated : May 14, 2021, 9:32 AM IST

అనుమతులు లేవంటూ సూర్యాపేట జిల్లాలో రాష్ట్రానికి చెందిన అంబులెన్స్‌లను పోలీసులు నిలిపివేశారు. రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద వాహనాలను నిలుపుదల చేశారు. ఆస్పత్రుల్లో పడక రిజర్వు చేసుకున్న వారికే అనుమతించారు. ఆస్పత్రి నుంచి అనుమతి పత్రం పొందిన ఏపీ రోగులకు మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. కొవిడ్ కంట్రోల్ రూం అనుమతి పత్రం ఉంటే తప్ప తెలంగాణలోకి ప్రవేశం లేదని పోలీసులు పేర్కొన్నారు.

పుల్లూరు వద్ద అదే స్థితి..

మరోవైపు జోగులాంబ గద్వాల, కర్నూలు జిల్లాల సమీపంలోని పుల్లూరు టోల్‌ గేట్‌ వద్ద సైతం అంబులెన్సులను నిలిపివేశారు. ఏపీ నుంచి వచ్చే అత్యవసర వైద్య సేవల వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ-పాస్ ఉన్న అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఏపీ తెలంగాణ బోర్డర్ : మరోసారి అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు

ఇవీ చూడండి :

ఎస్కార్ట్ వాహనం మీదకు దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు పోలీసులు మృతి

Last Updated : May 14, 2021, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details