కర్నూలు జిల్లాలో కొత్తగా మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్ బులిటెన్లో మొత్తం 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు చెప్పారు.
వాటిలో కర్నూలు జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 540 మంది కరోనా బారిన పడగా... వారిలో 360 చికిత్స పొందుతున్నారు. 168 మంది చికిత్స పొంది ఇళ్లకు వెళ్లారు. 12 మంది మృతిచెందారు.