కర్నూలు జిల్లా డోన్‌లో మోటారు వాహనముల తనిఖీ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వాహనదారుల నుంచి చలాన కంటే అధిక డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు చేశామని డీఎస్పీ నాగభూషణం తెలిపారు. దాడుల్లో ఏజెంట్లైన రామచంద్రమోహన్, అన్వర్‌బాషా,అక్బర్ అనే ముగ్గురు ప్రైవేటు వ్యక్తుల నుంచి 40 వేల 20 రూపాయలు నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని మధ్యవర్తులుగా ఉపయోగించుకుని ఎంవీఐ శివశంకర్ రెడ్డి డ్రైవింగ్ లైసెన్సు, ఎల్ఎల్ఆర్, ఇతర ధ్రువపత్రాలకు సంబంధించిన పనులు త్వరితగతిన చేస్తామంటూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలనే నివేదికలో పొందుపరచి పై అధికారులకు పంపిస్తామన్నారు. ఎల్ఎల్ఆర్ పత్రాలు, ఒరిజినల్ డాక్యుమెంట్లను ఏజెంట్ల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తే ప్రజలు వెంటనే తెలియచేయాలన్నారు. వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనిశా వలలో ఎంవీఐ ఏజెంట్లు.. - ANISHA MEANING
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అనిశా అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కార్యలయంలో అధికారుల అండతో ఏజెంట్లు చేస్తున్న వసూళ్ల అక్రమాలను బట్టబయలు చేసి ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అనిశా వలలో ఎంపీఐ ఏజెంట్లు