కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న అంగన్ వాడీ కార్యకర్త మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. నందికొట్కూరు నియోజకవర్గం మాల్యాల గ్రామానికి చెందిన నూర్జహాన్ అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఈనెల 15న నందికొట్కూరు పట్టణంలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత అనారోగ్యంతో కర్నూలు ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆసుపత్రిలో వైద్యులు త్వరగా స్పందించలేదని మృతురాలి కుమారుడు తెలిపాడు.
కరోనా టీకా వేయించుకున్న అంగన్వాడీ కార్యకర్త మృతి - కర్నూలు జిల్లా నేర వార్తలు
కరోనా టీకా వేయించుకున్న అంగన్వాడీ కార్యకర్త అనారోగ్యంతో మృతి చెందింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
కరోనా టీకా వేయించున్న అంగన్వాడీ కార్యకర్త మృతి