జిల్లాలో ప్రతి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, దానికి సమీపంలోని ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలకు మ్యాపింగ్ చేయాలంటూ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు. భవిష్యత్తులో అంగన్‌వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలనే చర్యలో భాగంగానే మ్యాపింగ్ ప్రక్రియ తెర పైకి వచ్చిందనే భావన విద్యాశాఖలో వ్యక్తమవుతోంది. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ ఉద్యోగుల చరవాణి నంబర్లను సైతం ఉపాధ్యాయులకు అందించారు.
ఇందులో భాగంగా పలువురు ఉపాధ్యాయులు గ్రామాల్లో మ్యాపింగ్ పనులు చేపడుతున్నారు. కొంత మంది క్షేత్ర స్థాయికి వెళ్లి వివరాలు సేకరిస్తుండగా... మరికొందరు చరవాణుల్లో సమాచారం తీసుకుని పనులు చేస్తున్నారు. అంగన్‌వాడీ ఆయాలు, సూపర్‌వైజర్ల నుంచి ఉపాధ్యాయులు జిల్లా వ్యాప్తంగా సమాచారం సేకరిస్తున్నారు. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,549 అంగన్‌వాడీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,342 సొంత భవనాల్లో కొనసాగుతుండగా అద్దె భవనాల్లో 1,700 నడుస్తుండగా 507 కేంద్రాలు ఇతర భవనాల్లో నడుస్తున్నాయి.
వివరాల సేకరణ ఇలా..