ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"జగన్ పరిపాలన మిలిటరీ పాలనను తలపిస్తోంది" - కర్నూలు జిల్లా వార్తలు

Anganwadi leaders house arrest: జగన్ పరిపాలన మిలిటరీ పరిపాలనలా ఉందని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ అన్నారు. మేము విజయవాడకు వెళ్తామంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అంగన్వాడీ నాయకులను పోలీసులు నిర్బంధించడం దారుణమన్నారు.

anganwadi leaders house arrest
అంగన్వాడీ నాయకుల గృహ నిర్బంధం

By

Published : Mar 13, 2022, 8:03 PM IST

Anganwadi leaders house arrest: కర్నూలు జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో.. జిల్లా నాయకులైన నిర్మలమ్మ, వెంకటమ్మ, సేబా, గోవర్థనమ్మ, నిర్మల, సునీత బాయ్​లను ముందస్తుగా గృహ నిర్బందం చేశారు.

జగన్ పరిపాలన మిలిటరీ పరిపాలనలా ఉందని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ అన్నారు. అంగన్వాడీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధించడం దారుణమన్నారు. మేము విజయవాడకు వెళ్తామంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం విజయవాడకు రాకూడదా? అని నిలదీశారు.

ఇదీ చదవండి:అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే.. పరిస్థితేంటి ?: మంత్రి అవంతి

ABOUT THE AUTHOR

...view details