కర్నూలు జిల్లా గూడూరు మండలం నెరవాడ గ్రామ సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వక్కెరవాగులో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. చంద్రశేఖర్ అనే ఇంటర్ విద్యార్థి ఉదయం వాగు దాటుతూ నీళ్లలో గల్లంతయ్యాడు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కళ్లెదుటే విద్యార్థి కొట్టుకుపోయాడు. అక్కడ జనాలు ఉన్నా వాగు ఉద్ధృతికి ఎవరూ కాపాడలేకపోయారు. విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చూస్తుండగానే..వాగులో కొట్టుకుపోయిన ఇంటర్ విద్యార్థి - నెరవాడలో విద్యార్థి గల్లంతు వార్తలు
కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కర్నూలు సమీపంలోని నెరవాడలో వాగు దాటుతూ ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు.
![చూస్తుండగానే..వాగులో కొట్టుకుపోయిన ఇంటర్ విద్యార్థి An Inter student missing while crossing a stream in Nerawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8167106-1026-8167106-1595667022903.jpg)
వాగులో కొట్టుకపోయిన విద్యార్థి
Last Updated : Jul 25, 2020, 5:02 PM IST