ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నారిని బలితీసుకున్న మతిస్థిమితం లేని మహిళ - జోహరపురాపురంలో చిన్నారి మృతి

మతిస్థిమితం లేని ఓ మహిళ చేతిలో నాలుగేళ్ల చిన్నారి బలైపోయింది. ఆడుకుంటున్న ఆ పాపను ఇంటిలోకి తీసుకెళ్లి నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేసింది ఆ మహిళ.

An insane woman put a child  into the water drum at karnool
చిన్నారి

By

Published : Feb 18, 2020, 4:43 AM IST

కర్నూలు పాతబస్తీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని జోహరపురానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి రేష్మా ఇంటి ముందు సోమవారం ఆడుకుంటోంది. ఆ సమయంలో పక్కింటిలో ఉంటున్న మతిస్థిమితం లేని మహిళ చిన్నారిని ఇంటిలోకి తీసుకెళ్లింది. అనంతరం పాప చేతులు కట్టివేసి నీళ్ల డ్రమ్ములో వేసింది. చిన్నారి రేష్మ కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు అంతా గాలించారు. అనంతరం కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతిస్థిమితంలేని మహిళ తండ్రి రాత్రి ఇంటికి వచ్చి డ్రమ్ము మూత తీసి చూసే సరికి పాప విగతజీవిలా కనిపించింది. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మతిస్థిమితంలేని మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భర్త పట్టించుకోకపోవటంతో ఈమె తన తండ్రి వద్ద ఉంటోంది.

ఇదీచూడండి.ఫ్లెక్సీల ఏర్పాటులో వివాదం

ABOUT THE AUTHOR

...view details