అమ్మఒడి కార్యక్రమంలో ఫ్లెక్సీల రచ్చ..! - ammavodi program news in gooduru
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు జడ్పీ పాఠశాల ఆవరణలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. అయితే వైకాపా నేతలే ఇరువర్గాలుగా మారి... తమ ఫ్లెక్సీలు పెట్టాలంటే తమవి పెట్టాలని వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇరువురి ఫ్లెక్సీలు తొలగించారు. ప్రభుత్వ ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో ఇరువర్గాల నేతల మధ్య గొడవ సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రెడ్డి అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు.