ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో హీరో కల్యాణ్‌రామ్‌ సందడి.. అమిగోస్‌ చిత్ర ట్రైలర్‌ విడుదల - Amigos trailer release at Kurnool Srirama Talkies

Amigos trailer release at Kurnool: కర్నూలులో హీరో కల్యాణ్ రామ్‌ సందడి చేశారు. కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రం ట్రైలర్‌ను స్థానిక శ్రీరామ టాకీస్‌లో విడుదల చేశారు. సినిమా తప్పక విజయం సాధిస్తుందని కల్యాణ్ రామ్ తెలిపారు. కల్యాణ్ రామ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ నెల 10న అమిగోస్ సినిమా విడుదల కానుంది.

Amigos trailer release at Kurnool
Amigos trailer release at Kurnool

By

Published : Feb 4, 2023, 12:47 PM IST

Amigos trailer release at Kurnool: కథానాయకుడు నందమూరి కల్యాణ్​రామ్​ హీరోగా నటించిన సినిమా 'అమిగోస్'​. ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను కర్నూలులో స్థానిక శ్రీరామ టాకీస్‌లో విడుదల చేసింది చేశారు​. తప్పక విజయం సాధిస్తుందని కల్యాణ్ రామ్ తెలిపారు. కల్యాణ్ రామ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇందులో మూడు కోణాల్లో సాగే పాత్రలో కల్యాణ్​రామ్ కనిపించారు. కల్యాణ్​రామ్​ సరసన అషికా రంగనాథ్​ నటించింది.

ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫర్​గా ఎస్‌. సౌందర్‌రాజన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్​గా అవినాష్‌ కొల్లా, ఎడిటర్​గా తమ్మిరాజు పనిచేశారు. ఈ సినిమా ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'ఎమిగోస్‌' అంటే తెలుగులో స్నేహితులు అని అర్థం. 'బింబిసార'తో గతేడాది ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కల్యాణ్‌రామ్‌ నుంచి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో ఇదొకటి.

కర్నూలులో అమిగోస్‌ చిత్రం ట్రైలర్‌ విడుదల.. భారీగా వచ్చిన కల్యాణ్‌రామ్‌ అభిమానులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details