కర్నూలులో అంబేడ్కర్‌కు కలెక్టర్ నివాళి - Kurnool District Latest News
కర్నూలులో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 64వ వర్ధంతి నిర్వహించారు. జిల్లా పాలనాధికారి వీర పాండియన్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. స్థానిక ప్రజా సంఘల నేతలు అంబేడ్కర్ గొప్ప తనాన్ని కొనియాడారు.
గొప్ప వ్యక్తి అంబేడ్కర్
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 64వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా పాలనాధికారి వీర పాండియన్ నివాళి అర్పించారు. నగరంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం స్థానిక భాజపా నేతలు, ప్రజా సంఘల నాయకులు రాజ్యాంగ నిర్మాతకు అంజలి ఘటించారు. ఆయన సేవలను కొనియాడారు.