కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పరిధిలోని పాలకుర్తి గ్రామం నుంచి కోడుమూరు వరకు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు.
గూడూరు మండల పరిధిలోని గ్రామాల్లో అంబేడ్కర్ 130వ జయంతి ఘనంగా జరిగింది. గుడిపాడు, చనుగొండ్ల, కె నాగలాపురం గ్రామాల్లో రాజ్యాంగ సృష్టికర్త చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు.