ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతే ఆంధ్రప్రదేశ్​కు ఏకైక రాజధాని.. రైతులతో రాహుల్​ - రాహుల్ గాంధీని కలిసిన అమరావతి రైతులు

FARMERS MEET RAHUL GANDHI : అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీని రాజధాని రైతులు కలిశారు. అమరావతి రైతుల పోరాటానికి న్యాయసహాయం అందిస్తామన్న రాహుల్​.. వీలైతే పాదయాత్రలో పాల్గొంటానని తెలిపినట్లు రైతులు పేర్కొన్నారు.

FARMERS MEET RAHUL GANDHI
FARMERS MEET RAHUL GANDHI

By

Published : Oct 18, 2022, 5:06 PM IST

Updated : Oct 18, 2022, 6:21 PM IST

AMARAVATI FARMERS MEET RAHUL GANDHI : కర్నూలు జిల్లాలో ప్రవేశించిన భారత్​ జోడో యాత్రలో రాహుల్ గాంధీని అమరావతి రైతులు కలిశారు. అమరావతినే రాజధానిగా ఉండాలని రాహుల్​ను కోరారు. అమరావతే ఆంధ్రప్రదేశ్​కు ఏకైక రాజధానిగా ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పినట్లు అమరావతి రైతులు తెలిపారు. తమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారని.. న్యాయ సహాయం చేస్తామని చెప్పారని.. వీలైతే పాదయాత్రలో పాల్గొంటానని రాహుల్​ చెప్పినట్లు రైతులు తెలిపారు.

అంతకుముందు రాహుల్​గాంధీని పోలవరం నిర్వాసిత రైతులు కలిశారు. పోలవరం నిర్వాసిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

అమరావతి రైతులతో రాహుల్​గాంధీ

ఇవీ చదవండి:

Last Updated : Oct 18, 2022, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details